హనీ ట్రాప్ ద్వారానే ఎన్నారై హత్య…కమెడియన్ కూడా నిందితుడే

nri murder through honey trap

ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. హనీ ట్రాప్ ద్వారానే  జయరాం హత్యకు కుట్ర చేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు. జయరాం హత్య కేసులో ఛార్జి షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 పేజీల చార్జి షీట్‌ను బంజార హిల్స్ పోలీసులు దాఖలు చేశారు. చార్జిషీట్‌లో 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1గా రాకేష్ రెడ్డి, ఏ2గా విశాల్‌నే చేర్చారు. ఈ కేసులో మొత్తం 73 మందిని సాక్షులుగా చేర్చిన పోలీసులు 12వ సాక్షిగా శిఖా చౌదరి ఉన్నారు. హత్య కేసులో ముగ్గురు పోలీసులకు కూడా సంబంధం ఉన్నట్టు తేలింది. నిందితుల్లో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్టు విచారణలో తేలడంతో నల్లకుంట ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు , రాంబాబు, మల్లారెడ్డిలను చార్జిషీట్‌లో నిందితులుగా చేర్చారు. హత్యజరిగిన సమయంలో హనీ ట్రాప్ తర్వాత తక్షణం రూ. 50 లక్షలు ఇవ్వాలని రాకేష్ రెడ్డి జయరాంను డిమాండ్ చేసినట్లుగా సమాచారం. తలదిండుతో జయరాంను ఊపిరాడక రాకేష్ రెడ్డి హత్య చేశారు. జయరాంను చిత్రహింసలు పెట్టి రాకేష్ రెడ్డి చంపినట్టు స్పష్టమైంది. ఈ మొత్తం దృశ్యాల్ని నిందితుడు రాకేష్ రెడ్డి వీడియోలో చిత్రీకరించాడు. 11 వీడియోలు, 13 ఫొటోలను తీశారు. ఆ సమయంలో గుండె నొప్పి రావడంతో తనను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని జయరాం ఎంతగా ప్రాధేయపడిన రాకేష్ రెడ్డి వినలేదని విచారణలో తేలింది. ఇక ఈ కేసులో A1గా రాకేష్‌రెడ్డి A5గా సూర్య ప్రసాద్ (కమేడియన్),A10 శ్రీనివాసులు (నల్లకుంట మాజీ ఇన్స్పెక్టర్), A11 రాంబాబు (రాయదుర్గం మాజీ ఇన్స్పెక్టర్), A12 మల్లారెడ్డి (ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ) ఉన్నారు.