సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ 2022-23లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్టేట్ ఫోకస్ పేపర్ 2022-23ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మన్ డాక్టర్ జి.ఆర్.చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.