C /o సూర్య… తెలుగు బులెట్ రివ్యూ.

Sundeep-Kishan--surya-Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :    సందీప్‌ కిషన్‌, మెహ్రీన్‌

నిర్మాత  :  చక్రి  చిగురుపాటి 
దర్శకత్వం :  సుసీన్  తిరన్ 

మ్యూజిక్ డైరెక్టర్ :  ఇమ్మాన్ 

ఎడిటింగ్ : కాశి విశ్వనాథన్ 

సినిమాటోగ్రఫి : లక్ష్మణ్    కుమార్ 

ప్రస్థానంతో తన మార్క్ నటన. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో మంచి సెలక్షన్ అన్న పేరు తెచ్చుకున్న సందీప్ కిషన్ కొన్నాళ్లుగా సక్సెస్ ట్రాక్ తప్పాడు. అయితే మళ్ళీ గాడిలో పడటానికి సందీప్ ఆచితూచి ఎంచుకుని చేసిన సినిమా c / o సూర్య. నా పేరు శివ వంటి సినిమాలు చేసిన తమిళ్ దర్శకుడు సుశీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో c / o సూర్య మీద అంచనాలు పెరిగాయి. ఇటీవల లక్కీ లేడీ గా టాలీవుడ్ లో సక్సెస్ లు కొనసాగిస్తున్న మెహ్రీన్ కధానాయిక కావడం కూడా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ తెప్పించింది. అందుకు తగ్గట్టు సినిమా వుందో, లేదో చూద్దామా.

కథ…

సుందీప్ కిషన్, విక్రాంత్ మంచి స్నేహితులు. అయితే ఓ అపార్ధం వారు ఇద్దరినీ విడదీస్తుంది. ఇంతలో విక్రాంత్ కి ఓ కాంట్రాక్టు కిల్లర్ తో గొడవ జరుగుతుంది. అతడి నుంచి స్నేహితుడిని, అతని కుటుంబాన్ని రక్షించే క్రమంలో కొన్ని విలన్ చేసే నేరాల వెనుక వున్న విస్తుపోయే రహస్యాలు తెలుస్తాయి. క్రైమ్ ని చాలా తెలివిగా వాడే విలన్, అంత కన్నా పదునైన హీరో మధ్య ఎత్తులు, పై ఎత్తులు తో చివరకు ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా.

విశ్లేషణ…

కధగా చూసుకుంటే ఇలాంటి కధలు చాలా వచ్చాయి. అంతెందుకు సందీప్ కిషన్ చేసిన టైగర్ లాంటి సినిమా కథ కూడా ఇదే లైన్ లో ఉంటుంది. కానీ పాత కథ ని ఎంత బాగా తీయొచ్చు అనేదానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. ఈ తరం కుర్రోళ్ళ ఆలోచనలు, అంతరంగం, తెలివితేటలు ఎలా వుంటాయో బాగా స్టడీ చేసాడు దర్శకుడు. ఇక క్రిమినల్ కార్యకలాపాల్లో ఎంత దారుణమైన ఆలోచనలు వుంటాయో, సాదాసీదాగా ఏ అనుమానం రాకుండా మనిషిని ఎలా చంపుతారో దర్శకుడు బాగా చూపాడు. ఈ రెండు వర్గాలకి ప్రతినిధులుగా సందీప్ కిషన్. హరీష్ ఉత్తమన్ కనిపించారు. ఫ్రెండ్ షిప్, లవ్, సస్పెన్స్, ఇంటలిజెన్స్, యాక్షన్ కలిపిన థ్రిల్లర్ అనిపిస్తుంది ఈ సినిమా. అయినా ఎక్కడా తడబాటు,ఇబ్బంది లేకుండా స్క్రీన్ ప్లే రేసు గుర్రంలా దూసుకెళుతుంది.

సుందీప్ కిషన్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అయినా ఇంకా బాగా చేసాడు అనిపిస్తుంది ఈ సినిమా చూసాక. ఇక హరీష్ ఉత్తమన్ ద్వారా వెండితెరకి ఓ సూపర్ విలన్ దొరికాడు. విలనిజం లో చాన్నాళ్ళకి కొత్త పోకడలు కనిపించిన సినిమా ఇది. కెమెరా, మ్యూజిక్, డైలాగ్స్ ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ కనిపించిన సినిమా ఇది. హీరో, హీరోయిన్ మధ్య ఒకటిరెండు సన్నివేశాలు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ .

దర్శకుడు
కధనం
యాక్షన్ ఎపిసోడ్స్
హీరో
విలన్

మైనస్ పాయింట్స్ .

అక్కడక్కడా తమిళ వాసన.

తెలుగు బులెట్ పంచ్ లైన్… c /o సూర్య తో హీట్ బట్ నీట్.
తెలుగు బులెట్ రేటింగ్… 3.25 / 5 .