ఎనిమిదేళ్లుగా ఒక యువతితో సహజీవనం చేసిన ఒక వ్యక్తి ఆమెకు తెలియకుండా మరో యువతితో ఐదేళ్లు డేటింగ్ చేసి, పెళ్లి చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం యువతులిద్దరికీ తెలియడంతో అసలు మోసం బయటపడింది.
పెళ్లి చేసుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లిహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లాకు చెందిన ఆకుదారి కార్తీక్ (29) గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం యూసఫ్‌గూడలోని ఓ యువతి (25)తో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమకు దారితీసింది.
ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్లుగా వివాహం చేసుకోమని యువతి అడిగితే, కొన్ని సమస్యలు ఉన్నాయని దాట వేస్తూ వచ్చాడు. సహజీవనం చేస్తున్న యువతికి తెలియకుండా కార్తీక్ ఐదేళ్ల క్రితం యూసఫ్‌గూడ ప్రాంతానికే చెందిన మరో యువతి(22)ని ప్రేమించాడు.
కొన్నాళ్లు సహజీవనం చేసి, ఆ యువతి ఒత్తిడి మేరకు స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి భార్యాభర్తలుగా కాపురం చేస్తున్నారు. అయితే కార్తీక్ యువతులిద్దరికీ తెలియకుండా సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నాడు.
కార్తీక్ చేస్తున్న మోసం ఇటీవల ఇద్దరు యువతులకు తెలిసిపోయింది. దీంతో గొడవకు దిగారు. తనతో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తూనే, కార్తీక్ మోసం చేసి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.