సీనియర్‌ ఐ.టి. ఉద్యోగులపై వేటు

సీనియర్‌ ఐ.టి. ఉద్యోగులపై వేటు

వచ్చే త్రైమాసికాల్లో ఐటీ సేవల సంస్థ ​కాగ్నిజెంట్ 7వేల ఉద్యోగాలను తగ్గించే ప్రయత్నంలో ఉంది. క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వృద్ధి రంగాలలో పెట్టుబడులని పెట్టనుంది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంలో కంపెనీ ప్రతినిధి విశ్లేషకులతో పోస్ట్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్‌లో కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ మాట్లాడుతూ కంటెంట్ మోడరేషన్ వ్యాపారంలో కొన్ని భాగాల నుండి నిష్క్రమించడం రాబోయే సంవత్సరంలో ఆర్థిక పనితీరును దెబ్బతీస్తుందని తెలిపారు.

కంటెంట్‌ రివ్యూ కాంట్రాక్టర్‌గా ఫేస్‌బు​క్‌కు కంటెంట్‌ రివ్యూ కాంట్రాక్టర్‌గా కాగ్నిజెంట్ పని చేస్తుంది. కాగ్నిజెంట్ తన కంటెంట్ మోడరేషన్ వ్యాపారం కంటెంట్‌ రివ్యూ కాంట్రాక్టర్‌గా విత్ డ్రా అవుతున్నట్టు తెలిపింది. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం ఉన్న పది నుండి పన్నెండు వేల సీనియర్ ఉద్యోగులను తొలగించబోతున్నామని కాగ్నిజెంట్  కంపెనీ అధికారులు తెలియ చేశారు.