తెలంగాణలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నిన్న ఒక్కరోజే ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎవరెవరికీ కరోనా ఉందో అంతుపట్టని పరిస్థితి హైదరాబాద్ లో నెలకొంది. దీంతో ఇళ్లలోంచి అత్యవసరం అయితే తప్ప ఏ ఒక్కరూ బయటకు వెళ్లడం లేదు.
ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుంది. దాంతో నిరుపేదలు ఇండ్లలోనే ఉండేందుకు రేషన్ కార్డులు ఉన్నవారికి ఇళ్లకే బియ్యం, పప్పులు వంటి నిత్యావసరాలను తెచ్చి ఇస్తుంది.
ఈరోజు సికింద్రాబాద్ సమీపంలోని కాప్రా మండలంలోని కార్పోరేటర్ స్వర్ణరాజ్ శివమణి స్వయంగా ఇంటింటికీ తిరిగి వారి బాగోగులు అడిగి తెలుసుకొని బియ్యం, పప్పులను పంపిణీ చేయడమే కాకుండా ఇంటి చుట్టూతా బ్లీచింగ్ తో పిచికారి చేస్తున్నారు. కొన్ని ఎన్. జి.ఓ లతో కలసి పగలు రాత్రి కూడా తమ పరిధిలో రేషన్ కార్డులు లేని మధ్యతరగతి, నిరుపేదలకు ఇంటింటికీ తిరిగి కార్పోరేటర్ మరియు ఆయన సహచరులు బియ్యం, పప్పులు పంపిణీ చేస్తున్నారు. మొత్తానికి కరోనా మహమ్మారిని అరికట్టేందకు తెలంగాణ ప్రభుత్వం తగిన అన్ని చర్యలు తీసుకుంటోంది.