అలనాటి హీరోయిన్ మాలశ్రీ చెల్లెలు సుభశ్రీ కూడా కథానాయికగా రాణించింది. మలయాళ చిత్రాలతో పాటు ఊహ, పెదరాయుడు వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అసలు పేరు భారతి పాండే. కానీ ఆమె నటించిన సుభశ్రీ మూవీ పెద్ద హిట్ కావడంతో అదే ఆమె అసలు పేరుగా మారిపోయింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తను చిన్నపిల్లలతో ఆడుకునే సమయంలో ఓ అబ్బాయి వచ్చి సైట్ కొట్టేవాడంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నామని తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చింది. అతడు డైమండ్ రింగ్‌ను తొలి బహుమతిగా ఇచ్చాడంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. తాను స్కూలుకు వెళ్లకుండా ఉండటానికే సినిమాల్లోకి వచ్చానంది.
కాగా సుభశ్రీ, అలీ అల్లరి పెళ్లికొడుకు సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో వీళ్లిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అయితే షూటింగ్ జరుపుకుంటుండగానే ఆ ఫొటో బయటకు వచ్చింది. దీంతో ఓ మ్యాగజైన్ అలీ, సుభశ్రీ పెళ్లైపోయిందంటూ ఓ కథనం రాయగా అది చూసి అలీ భార్య షాకైందట! ఆ సంఘటనను తలుచుకుని సుభశ్రీ పడీపడీ నవ్వింది.