టాలీవుడ్‌తో పాటు అన్ని సినిమా పరిశ్రము కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడి నలిగి పోతున్నాయంటూ కొందరు హీరోయిన్స్ ఈమద్య కాలంలో తెగ ఆందోళన చెందుతున్న విషయం తెల్సిందే. పలువురు హీరోయిన్స్ కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్న వారే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. అయితే కొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలోనే లేదని, అయితే కొందరు అవకాశాల కోసం తప్పు చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఇలా జరుగుతుందని కొందరు అంటున్నారు. ఈ విషయమై తాజాగా ప్రముఖ కమెడియన్ పృథ్వీ స్పందిస్తూ విభిన్నంగా వ్యాఖ్యలు చేశాడు. కాస్టింగ్ కౌచ్‌లో నటీమణులదే తప్పంతా అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు.
సినిమా పరిశ్రమ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. బయట సినిమా పరిశ్రమకు చెందిన ఆడవారికి ఇల్లు అద్దెకు దొరకడం లేదు. సినిమా పరిశ్రమ వారు అనగానే ఒకరకమైన చిన్నచూపు చూస్తున్నారు. వారు ఎంతగా చెప్పి చూసినా, వారిని తప్పు అర్థంతోనే చూస్తున్నారు. ఎలాంటి తప్పులు చేయని వారు కూడా కొందరి వల్ల తప్పు అనిపించుకుంటున్నారు. తాజాగా ఒక నటి ప్రముఖ నిర్మాతను నానా బూతులు తిట్టింది. అతడు తనను వాడుకున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆమె స్వయంగా ఆ నిర్మాత గెస్ట్ హౌస్‌కు వెళ్లిన విషయం తెలియడం లేదా, మొదట ఇష్టం అయ్యి వెళ్తారు, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతారు అన్నట్లుగా పృథ్వీ వ్యాఖ్యనించాడు. పృథ్వీ మాట్లాడిన మాటల్లో కూడా నిజం ఉందని, అతడు చెప్పినట్లుగా కొందరి వల్ల ఎక్కువ శాతం సినిమా పరిశ్రమకు చెడ్డ పేరు వస్తుంది.