ఎన్టీఆర్‌పై పవన్‌ క్లాప్‌.. అంతా నవ్వులు

Comedy at clap time

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘జైలవకుశ’ చిత్రంతో తాజాగా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను అందుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తర్వాత సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి లేదా ఆ తర్వాత ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అయితే నేడు చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయ్యాయి. ఈ షూటింగ్‌ ప్రారంభోత్సవంకు పవన్‌ కళ్యాణ్‌ చీఫ్‌ గెస్ట్‌గా రావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. పవన్‌తో ప్రస్తుతం త్రివిక్రమ్‌ మూవీని చేస్తున్నాడు. దాంతో పాటు త్రివిక్రమ్‌కు పవన్‌కు మద్య చాలా సన్నిహిత సంబంధాలున్నాయి.

త్రివిక్రమ్‌ కోసం ఎన్టీఆర్‌పై క్లాప్‌ కొట్టేందుకు పవన్‌ వచ్చాడు. నేడు ఉదయానే షూటింగ్‌ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయ్యాయి. ఇక షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్బంగా సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌ చిత్ర పటాల ముందు నిల్చుని దండం పెట్టే సీన్‌కు పవన్‌ కళ్యాణ్‌ క్లాప్‌ కొట్టాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్‌ పై క్లాప్‌ కొట్టి పవన్‌ అక్కడ కింద కూర్చుండి పోయాడు. పక్కకు జరిగే వీలు లేక పోవడంతో పాటు, అక్కడ నుండి వెంటనే పక్కకు జరిగే అవకాశం లేదు. ఆ కారణంగా కెమెరాకు అడ్డం అనే ఉద్దేశ్యంతో పవన్‌ క్లాప్‌ కొట్టి అక్కడే కూర్చుండి పోయాడు.

పవన్‌ క్లాప్‌ కొట్టి అక్కడ కూర్చుండి పోవడంతో షాట్‌లో ఉన్న ఎన్టీఆర్‌తో పాటు అక్కడ ఉన్న వారు అంతా కూడా నవ్వేశారు. ఎన్టీఆర్‌ కట్‌ చెప్పేంత వరకు నవ్వు ఆపుకుని ఆ తర్వాత గట్టిగా నవ్వేశాడు. ఆ వెంటనే పవన్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. అంతకు ముందు పవన్‌ షూటింగ్‌ ప్రారంభోత్సవం స్థలం వద్దకు వచ్చేందుకు కారు దిగగానే, ఎన్టీఆర్‌ పవన్‌కు ఎదురు వెళ్లి మరీ ఆహ్వానం పలికాడు. పవన్‌ కూడా ఎన్టీఆర్‌తో సరదాగా ముచ్చటించాడు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల సినిమా సక్సెస్‌ కావాలని పవన్‌ కళ్యాణ్‌ ఆకాంక్షించాడు.