‘హౌరా బ్రిడ్జ్‌’లో హీరోహీరోయిన్‌ల కెమిస్ట్రీ అదుర్స్‌

Eagerly Waiting Howrah Bridge Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ సినిమాను అయినా హీరో, హీరోయిన్‌ మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయితేనే యూత్‌ ఆడియన్స్‌ ఓన్‌ చేసుకుంటారు. ప్రస్తుత యూత్‌ ఆడియన్స్‌ను కట్టి పడేసే సీన్స్‌ ‘హౌరాబ్రిడ్జ్‌’లో ఉన్నాయంటూ దర్శకుడు యాదు అంటున్నారు. హీరో రాహుల్‌ రవీంద్రన్‌ మరియు హీరోయిన్‌ ఛాందిని చౌదరిల మద్య వచ్చే లవ్‌ సీన్స్‌ మరియు రొమాంటిక్‌ సీన్స్‌ ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయని, ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని దర్శకుడు పేర్కొన్నారు. ఇద్దరు కలిసి నటించడం మొదటి సారే అయినా కూడా గతంలో పలు సార్లు కలిసి నటించిన అనుభవం ఉన్న వారి మాదిరిగా నటించి కెమిస్ట్రీని బాగా పండివ్వడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుని పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా చేసి మెప్పించిన రాహుల్‌ రవీంద్రన్‌ ఈ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకోవడం ఖాయం. ఈ చిత్రంలో హీరో పాత్రకు రాహుల్‌ రవీంద్రన్‌ చక్కగా సూట్‌ అయ్యాడని, పాత్రకు తగ్గట్లుగా రవీంద్రన్‌ నటించాడు. ఇక హీరోయిన్‌ తెలుగు అమ్మాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా చేయలేరని అంతా అనుకుంటారు. కాని ఛాందిని చౌదరి అన్ని విషయాల్లో కూడా నార్త్‌ హీరోయిన్స్‌కు ఏమాత్రం తక్కువ కాదు అని తనకు తాను నిరూపించుకుంది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపును తెచ్చి పెడుతుందని దర్శకుడు యాదు అన్నారు. ఇటీవలే విడుదలైన రెండు టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు