వివాదం.. అసలు నాగశౌర్య అన్నది ఏంటీ…?

Comments About NagaShourya Star Status

యువ హీరో నాగశౌర్య నేడు ‘నర్తనశాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత చిత్రం ‘ఛలో’ సక్సెస్‌ అవ్వడంతో నర్తనశాలపై అందరి దృష్టి ఉంది. అంచనాలకు తగ్గట్లుగా నర్తనశాలను శ్రీనివాస చక్రవర్తి తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. ఇక చిత్రం విడుదలకు ముందు నాగశౌర్య పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ సమయంలోనే నాగశౌర్య స్టార్‌ స్టేటస్‌ గురించి కామెంట్స్‌ చేయడం జరిగింది. ఇకపై స్టార్స్‌ ఎవరు రారని, రామ్‌ చరణ్‌తోనే అది పూర్తి అయ్యిందని పేర్కొన్నాడు. ఇటీవల విజయ్‌ దేవరకొండను అంతా కూడా స్టార్‌ అంటూ సంభోదిస్తున్న నేపథ్యంలో నాగశౌర్య ఈ వ్యాఖ్యలు చేశాడు అంటూ కొందరు విమర్శలు చేయడం జరిగింది.

nag-movies

నాగశౌర్య వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్‌ దేవరకొండ సక్సెస్‌ను చూసి ఓర్వలేక నాగశౌర్య కుల్లు బుద్దితో ఇలా విమర్శలు చేస్తున్నాడు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై నాగశౌర్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరో ఇంటర్వ్యూలో నాగశౌర్య స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు విజయ్‌ దేవరకొండ గురించి కానే కాదని, అసలు తాను ఏ హీరోను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చిరంజీవి ఎన్నో చిత్రాలు చేసి స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్నారు, పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఫ్లాప్‌ అయినా కూడా భారీగా వసూళ్లు వస్తాయి. అలాంటి వారు స్టడీగా కెరీర్‌లో ముందుకు సాగుతారు. అందుకే వారు స్టార్‌ హీరోలు. ప్రస్తుతం వస్తున్న హీరోల్లో నిలకడ ఉండదు, అందుకే తాను కొత్తగా స్టార్స్‌ రారు అంటూ వ్యాఖ్యలు చేశారు తప్ప, ఒక్కరి గురించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదు అంటూ నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు. అయినా కూడా ఆయనపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

nagsourya