Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ‘నాపేరు సూర్య’ చిత్రం విడుదల తేదీలో గందరగోళం నెలకొంది. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘భరత్ అను నేను’ను అదే రోజు అంటే ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మహేష్‌బాబు మూవీతో బన్నీ ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సమయంలో తాము డేట్ మార్చలేము అంటూ నిర్మాత తేల్చి చెప్పాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘2.0’ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
‘2.0’ చిత్రం విడుదల తేదీ ప్రకటించిన తర్వాత బన్నీ సన్నిహితులు కొందరు ఇలా తేదీని మార్చుతూ పోతే ఎలా అంటూ రజినీకాంత్ సినిమా నిర్మాతలను సున్నితంగా మందలించడం జరిగింది. వారు అవేవి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఆ చిత్రంపై ఉన్న అంచనాల నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ను వాయిదా వేయడం మంచిదని, ఆ చిత్రంతో ఢీ కొట్టడం వల్ల చాలా నష్టం అని మహేష్ మరియు బన్నీలు ఒక నిర్ణయంకు వచ్చారు. అలా నిర్ణయించుకున్న వారు తేదీల మార్పుకు చూస్తున్నారు.
ఈ సమయంలోనే అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం ఏప్రిల్ 13న విడుదల కాబోతుంది అంటూ ప్రకటన వచ్చింది. ముందుగా అనుకున్నదానికి రెండు వారాల ముందే సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. అయితే ఈ తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మెగా ఫ్యాన్స్ బన్నీ చిత్రం విడుదల తేదీకి సంబంధించి కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ ఈ విషయాన్ని క్లారిటీ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.