Election Updates: పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ బిగ్ షాక్…మీరే తేల్చుకోండన్న అధిష్టానం…

Congress big shock for Ponguleti and Thumma...You have to decide for yourself...
Congress big shock for Ponguleti and Thumma...You have to decide for yourself...

తుమ్మల, పొంగులేటి కి కాంగ్రెస్ బిగ్ షాక్ తగిలింది. మీరే తేల్చుకోండి అని తుమ్మల, పొంగులేటి పైన భారం వేసి చేతులెత్తేసింది కాంగ్రెస్ అధిష్టానం. కొత్తగూడెం టికెట్ పొత్తులో వామపక్షాలకు వెళ్లే అవకాశంతో, పాలేరు టికెట్‌ ఆశిస్తున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పాలేరు టికెట్ హామీతోనే పార్టీలోకి తుమ్మల నాగేశ్వర్‌రావు వచ్చారు.

ఈ లెక్కన కాంగ్రెస్ పాలేరు టికెట్ పోటీలో పొంగులేటి, తుమ్మల ఉన్నారన్న మాట. పాలేరు, ఖమ్మం రెండు సీట్లు ఇద్దరికీ ఇస్తామని….ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో మీరే నిర్ణయించుకోండని చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దింతో తుమ్మల, పొంగులేటి కి కాంగ్రెస్ బిగ్ షాక్ తగిలింది.

కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో ఏఐసీసీ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. పోటీ తీవ్రంగా ఉండటం, నాయకులు తాము సూచించిన వారికే టికెట్లివ్వాలని పట్టుబడుతుండటం వంటి వాటి వల్ల స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ నిర్ణయానికి వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈనెల 14వన తెలంగాణపై ఏఐసీసీ భేటీ కావచ్చని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.