బీజేపీ కబంధ హస్తాల్లో జగన్.

congress chief jagan in bjp hands

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వైసీపీ అధినేత జగన్ నిజంగానే ఊహల పల్లకిలో ఊరేగుతున్నారు. రాజకీయాల్లో 30 ఏళ్లుగా తలపండిన చంద్రబాబు సైతం మోడీ దగ్గర ఏపీ కి ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చుకోలేక పేపర్ మీద ప్యాకేజ్ కి ఓకే అనాల్సివచ్చింది. రాజకీయ అవసరాల కోసం టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల్లా నటిస్తున్నా ఇద్దరి మధ్య ఇదే అంశం మీద అంతులేని అగాధం ఏర్పడింది. ఆ అగాధాన్ని ఇంకాస్త పెంచి తాను వారధి కట్టుకుందామని ప్రయత్నించిన జగన్ అక్కడ అడ్డంగా ఇరుక్కుపోయారు. కేసుల నుంచి ఉపశమనం కోసం జగన్ బీజేపీకి లొంగిపోయాడని ఇప్పటికే ఓ టాక్ వచ్చేసింది. అదే ఊపులో ఇంకాస్త ముందుకు వెళ్లిన జగన్ బీజేపీ తో వచ్చే ఎన్నికల్లో పొత్తుకు కూడా ట్రై చేసాడు. ఈ విషయం అర్ధం చేసుకున్న ముస్లిం, క్రైస్తవ వర్గాల్లో అంతకుముందు జగన్ అంటే వున్న అభిమానం పోయింది.

jagan-mohan-reddy-nd-bjp-pa

చంద్రబాబుని దూరం చేసి తాను బీజేపీ కి దగ్గర అవుదామని జగన్ వేసిన పాచిక ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. ఆ వ్యూహం వల్ల వైసీపీ కి ఆది నుంచి గట్టి మద్దతు ఇస్తున్న వర్గాల్లో వ్యతిరేకత ఏర్పడింది. సరే ఇక్కడ నష్టం జరిగినా మోడీ పలుకుబడితో ఓట్లు వస్తాయి అనుకుంటే అటు బీజేపీ జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంతో అల్లాడిపోతోంది. మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లోనే గెలుపు కష్టం అంటున్న పరిస్థితి. అలాగని బీజేపీకి దూరంగా జరిగి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో పోరాటం చేద్దాం అనుకుంటే కేసుల భయం. మొత్తానికి బీజేపీ కబంధ హస్తాల్లో తనంతట తానే చిక్కుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఓ వెరైటీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధం అట. అటు బీజేపీకి ఇటు జనానికి కోపం రాకుండా చూసుకునేందుకు జగన్ ఇలాంటి ప్రకటనలతో చేస్తున్న ఫీట్లు, పడుతున్న పాట్లు చూస్తుంటే నవ్వు వస్తోంది.