సాక్షి పాపాన్ని ప్రశాంత్ కిషోర్ నెత్తిన రుద్దే ప్రయత్నం.

sakshi-trying-to-manipulate

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగినప్పటినుంచి వైసీపీ లో ఉక్కపోతకు గురి అవుతున్న కొందరు నేతలు తాజాగా మరో వైఫల్యాన్ని ఆయన మెడకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ పాదయాత్ర మొదలు పెట్టి నెలరోజులు గడిచింది. అంతకు ముందు తెలుగు మీడియా, అక్కడ సిబ్బందిని పూచిక పుల్లలా చూసిన జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందు తన సహజ ధోరణికి భిన్నంగా మీడియా ప్రతినిధులు, యాజమాన్యాలతో తన ప్రోగ్రాము కి కవరేజ్ ఇవ్వమని కోరాడు. పాత విషయాలు పక్కనబెట్టి తానే స్వయంగా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీని కలిశారు. ఇంత చేసినా మీడియాలో జగన్ పాదయాత్రకు మైలేజ్ రావడం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పాదయాత్ర విశేషాలను జనానికి చేరవేయడంలో ప్రశాంత్ కిషోర్ టీం విఫలం అవుతోందని ప్రశాంత్ అంటే పడని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. అదే ప్రచారం జగన్ కి చేరేలా చూస్తున్నారు.

jagan-mohan-reddy-and-prash

నిజంగానే జగన్ పాదయాత్రకు విశేష ప్రాధాన్యం మీడియాలో రావడం లేదు. టీవీ 9 , ఎన్ టీవీ లో సైతం స్లాట్ కొనుగోలుకు తగ్గట్టు తప్ప అదనపు ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించడం లేదు. ఇక మిగిలిన మీడియా జగన్ పాదయాత్రకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం సాక్షి. సాక్షిలో విశేషంగా కవరేజ్ వస్తుండడంతో దాన్ని వ్యాపార ప్రత్యర్థిగా భావించే మిగిలిన సంస్థలు అక్కడ పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక యాత్ర కవరేజ్ దగ్గర సాక్షి ప్రతినిధుల హడావిడి, ఆధిపత్య ధోరణి కూడా మిగిలిన పత్రికల ప్రతినిధులను హర్ట్ చేస్తోంది. ఇలా సాక్షి వల్ల జరుగుతున్న తప్పుల్ని ప్రశాంత్ నెత్తికి చుట్టి ఆయన్ని జగన్ దగ్గర నుంచి పంపేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారాన్ని జగన్ ఎలా చూస్తారో,ఏ నిర్ణయం తీసుకుంటారో ?