మోడీకి చుక్కలు కనపడుతున్నాయి.

Hardik-Patel-and-Rahul-Gand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కాలప్రవాహం ఎవరిని ఎలా మార్చేస్తుందో చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. సరిగ్గా నాలుగేళ్ళ కిందట సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ ఓ ప్రబల శక్తి. ఓ పోరాట స్ఫూర్తి. ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన జంఝామారుతం. ఆయన ముందు రాహుల్ గాంధీ ని పోల్చడానికి కూడా ఎవరికీ మనసొప్పలేదు. ఇక హార్దిక్ పటేల్ అయితే నిజంగానే మోడీ ముందు పిల్లకాకి అని చెప్పుకోవడం కూడా ఎక్కువే. నాలుగేళ్లలో ఎంత మార్పు. ఇప్పుడు ఆ మోడీ కి ప్రధాని పీఠం కూడా తోడయ్యింది. కానీ ఇప్పుడు రాహుల్ ని మాత్రమే కాదు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలా ప్రచారం చేస్తున్న హార్దిక్ పటేల్ ని చూసి కూడా మోడీ పీఠం లో ప్రకంపనలు వస్తున్నాయి.

Hardik

మోడీ రాజకీయ భవిష్యత్ కి పునాది పడింది సొంత రాష్ట్రం గుజరాత్ లో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్వస్థలం రాజ్ కోట్ లో ప్రధాని మోడీ బహిరంగ సభకు జనాన్ని తోలడానికి బీజేపీ బాగా కష్టపడింది. పీఎం, సీఎం పాల్గొన్న ఈ సభ కంటే అంతకు ముందు వారం హార్దిక్ పటేల్ సభకు సొంతంగా తరలివచ్చిన జనమే ఎక్కువ. ఇక మోడీ అమోద్ సభలో కుర్చీలు ఖాళీగా దర్శనం ఇస్తే సూరత్ లో 25 కిలోమీటర్ల రోడ్ షో తర్వాత కూడా హార్దిక్ పటేల్ బహిరంగసభకు జనం పోటెత్తారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడుగా కొత్తగా పీఠం ఎక్కిన రాహుల్ ని పప్పుగా చెప్పుకున్న వాళ్లే ఇప్పుడు మోడీ కి చెమటలు పట్టిస్తున్నాడని బీజేపీ మిత్రపక్షం శివసేన తన సామ్నా పత్రికలో చెప్పుకొచ్చింది. శివసేన చెప్పకుండానే ఆ విషయం గుజరాతీలు నాడి పట్టగల మోడీకి ఆ విషయం అర్ధం అయ్యింది. ఇప్పుడు దాకా గెలుపు, గౌరవం మాత్రమే చూస్తూ వస్తున్న మోడీకి ఇప్పుడిప్పుడే ఓటమి భయం పరిచయం అవుతోంది. రేపటి ఎన్నికల ఫలితం ఎలా ఉన్నప్పటికీ పిల్లకాకులు అనుకున్న రాహుల్, హార్దిక్ పటేల్ ఆయనకు సొంత గడ్డ గుజరాత్ లోనే చుక్కలు చూపిస్తున్న మాట నిజం.