రాజయ్యకి ఇంటిపోరు తప్పలేదు…!

Congress Gives Ticket To Singapuram Indira TO Contest Against Rajayya

కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. దాదాపు 65మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా చూస్తే ఒక్కటే స్పష్టమవుతోంది. ఆర్థిక అండదండలున్న వారికే టికెట్ల కేటాయింపు అని స్పష్టం అయినట్టే. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకంగా మూడు సీట్లను చేజిక్కించుకోవడం కాంగ్రెస్ నేతల్లో విస్మయానికి గురిచేసింది. ఇక వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా సాగనుంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు దగ్గరి బంధువులు కావడమే విశేషం. టీఆర్ఎస్ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఆయనపై పోటీగా కాంగ్రెస్ పార్టీ సింగాపురం ఇందిరను నిలిపింది. ఇందిర స్వయానా రాజయ్య బావమరిది సతీమణే కావడం గమనార్హం. రాజయ్య మీద నియోజకవర్గంలో తీవ్ర విమర్శలున్నాయి. ఓడిపోతాడనే ప్రచారం కూడా జరుగుతోంది.

rajayya

ఈ నేపథ్యంలో రాజయ్యపై ఖచ్చితంగా గెలిచేలా కాంగ్రెస్ టికెట్ ను ఆయన బావమరిది భార్య సింగాపురం ఇందిరకు కేటాయించారు. రాజయ్య ఫ్యామిలీ మెంబరే కావడం.. పైగా బాగా ఆర్థిక బలం ఉండడంతో ఈమె రాజయ్యను ఖచ్చితంగా ఓడిస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ తీవ్రంగా పోటీపడిన విజయరామారావు – రేవంత్ తోపాటు దొమ్మాటి సాంబయ్యలకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించింది. వీరు ఆర్థికంగా లేకపోవడం.. పెద్ద ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతోనే టికెట్ దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా బలవంతురాలైన ఇందిరకు టికెట్ ఇస్తే రాజయ్య ఖచ్చితంగా ఓడిపోతాడని కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి నివేదించారు. దీంతో అందరినీ తోసిరాజని బలమైన ఇందిరకు స్టేషన్ ఘన్ పూర్ సీటును కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసింది. స్టేషన్ ఘనపూర్ ప్రాంతంలో ఇందిర కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబం కావడం, అంగబలం పుష్కలంగా ఉండటంతో ఆమెకు గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

trs-rajayya