కొత్త వారితో వైట్ల ప్రయత్నం సఫలం అయ్యేనా…?

Srinu Vaitla Gives Credit To Young Writers At Amar Akbar Antony

శ్రీనువైట్ల ‘దూకుడు’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. వరుసగా నాలుగు సినిమాలతో అట్టర్‌ ఫ్లాప్‌లను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా రవితేజతో కలిసి ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. గతంలో శ్రీనువైట్ల దర్శకత్వం వహించి, సూపర్‌ హిట్‌ అయిన సినిమాలకు కోన వెంకట్‌ మరియు గోపీ మోహన్‌లు స్క్రిప్ట్‌ను అందించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రాలు మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. అయితే కోనతో గొడవ కారణంగా శ్రీనువైట్ల సొంతంగానే స్క్రిప్ట్‌లు రాసుకున్నాడు. అయితే సొంతంగా రాసిన స్క్రిప్ట్‌ల వల్ల ఫ్లాప్‌లు పడటంతో కొత్త వారితో ఈసారి అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాకు వర్క్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

srinu-vitla

సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సమయంలో తనతో పాటు వర్క్‌ చేసిన కొత్త రచయితలను శ్రీనువైట్ల పరిచయం చేయడం జరిగింది. శ్రీనువైట్ల కొత్త రచయితలతో చాలా రోజులు ట్రావెల్‌ చేసి, వారితో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో కొత్త రచయితలు ఏ స్థాయిలో ఆకట్టుకున్నారో చూడాలి. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన విడుదల ఏర్పాట్లలో శ్రీనువైట్ల మునిగి ఉన్నాడు. ఈ సినిమా ఫలితం తారు మారు అయితే మాత్రం చిత్ర యూనిట్‌ సభ్యుల్లో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రవితేజ, ఇలియానా, శ్రీనువైట్ల. ఈ చిత్రంను మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా చూడాలి.

Srinu-Vaitla-Raviteja