కాంగ్రెస్‌కు రాజకీయాలు చేయడం మీద ఉన్న శ్రద్ధ దేశ భద్రత, దేశ ప్రజలపై లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి డు కిషన్ రెడ్డి అన్నారు. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ.. హిందువులను కాల్చి చంపితే సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు. ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు.



