కరోనాతో తృణమూల్ కాంగ్రెస్ నేత మృతి…..

పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందారు. దీన్ని కరోనా దేశంలో ఎంత తీవ్రంగా విస్తరిస్తుందో తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్, కరోనా వైరస్ సోకి కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే ఆమె ఏమన్నారంటే.. ‘చాలా చాలా దురదృష్టకరం, ఫాల్టా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న తమోనాష్ ఘోష్ మనల్ని వీడి వెళ్లిపోయారు’ అంటూ ట్వీట్ చేశారు. గత నెలలో ఆయనకు కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ప్రమాదం ఏర్పడిందని తెలిపారు.

కాగా తమోనాష్ ఘోష్, గత 35 సంవత్సరాలుగా మనతో కలిసి పనిచేశారని, పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని మమతా బెనర్జీ వివరించారు. ఆయన మృతికి తన ప్రాగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని.. ఈ సమయంలో ఆయన భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని వివరించారు. కాగా.. ప్రజా జీవితంలో ఉంటూ కరోనా బారిన పడి మరణించిన తమోనాష్ ఘోష్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.  అలాగే… తాజాగా కరోనాతో తమిళనాడులోని డీఎంకే నేత జే అన్బళగన్ మృతి చెందిన విషయం తెలిసిందే.