Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక నాయకుడు కమల్ పెట్టిన కొత్త పార్టీ పై అప్పుడే పెదవి విరుపులు మొదలయ్యాయి. కమల్ పార్టీకి తమిళనాడు పెద్దగా ఖాళీ లేదని కాంగ్రెస్ పార్టీ నేత వీరప్ప మొయిలీ విమర్శించారు. ఆయన ఒకప్పుడు తమిళనాడు రాష్ట ఇన్ చార్జ్ గా చాలా రోజులు పనిచేశారు. అక్కడి రాజకీయాలపై మొయిలీకి మంచి అవగాహనే ఉంది. అక్కడ కమల్ పార్టీకి చాలా తక్కువ మార్జిన్ ఉందని డియంకే, అన్నాడియంకే అక్కడ చాలా బలమైన ప్రాంతీయ పార్టీలని, మరోపక్క సూపర్ స్టార్ రజిని కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అని వీరి మధ్య కమల్ పార్టీ ముందు వెళ్ళాలి అంటే డియంకే, అన్నాడియంకేలలో ఎవరో ఒకరితో కలవాల్సిందే అని మొయిలీ అన్నారు.
నిజానికి అన్నా డియంకే కూలిపోతుంది అని అ స్థానాన్ని తను ఆక్రమించవచ్చు అని కమల్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంది. అలాగే నిన్న అబ్దుల్ కలం ఇంటినుండి తన యాత్రను ప్రారంభించడం పై కూడా విమర్శలు వస్తున్నాయి. తమిళనాడులో 7 శాతంగా ఉన్న ముస్లిం వోట్లను ఆకర్షించడానికి కమల్ ఇలా చేశారని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఇందులో ఎంతో కొంత నిజం కూడా లేక పోలేదు విశ్వరూపం సినిమా సమయంలో తమిళనాడు లోని ముస్లిమ్స్ కమల్ కి వ్యతిరేకంగా ఉద్యమించారు. దాని వలనే కమల్ తమిళనాడుని వదిలి వెళ్ళిపోతాను అని కూడా బెదిరించాడు, అప్పుడు మధ్యలో జయలలిత కల్పించుకుని వివాదాన్ని చల్లబరిచినా… ఇప్పటికీ కమల్ పై ముస్లింల వ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదు. దాన్ని తగ్గించుకోడనికే తమిళనాడులో ముస్లిమ్స్ అత్యంత గౌరవించే అబ్దుల్ కలామ్ గారి ఇంటికి వెళ్లారు అన్నది అక్కడి రాజకీయ విశ్లేషకుల వాదన. ఇది చాలదు అన్నట్లు అక్కడ ఉన్న రాజకీయ పార్టీలపై కాకుండా ఇంకా ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రాని రజినితో పై చీటికి మాటికి విమర్శలు ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్ధం కానీ విషయం.
ఇలా ప్రవర్తిస్తే అక్కడ బలంగా పాతుకుపోయిన డియంకె, అన్నాడియంకెల మధ్య కమల్ పార్టీ చోటు సంపాదించడం చాలా కష్టం. డీఎంకే, అన్నాడీఎంకేలను డామినేట్ చేసేలాగా కమల్ ప్రాంతీయ అజెండా ఉంటే మాత్రమే “మక్కల్ నీతి మయ్యం” కి స్థానం ఉంటుంది. లేదంటే కమల్ కి కష్టమే.