Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ లో నిరాశ, నిస్పృహలు అలముకున్న ప్రతిసారీ ప్రియాంక జపం చేయడం ఆ పార్టీకి అలవాటైపోయింది. అందుకే ఈసారి కూడా ప్రియాంకను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని సీనియర్లు, జూనియర్లనే తేడా లేకుండా అన్ని వర్గాల వాళ్లు సోనియాను డిమాండ్ చేసినంత పనిచేశారు. ప్రియాంక ఫాలోయింగ్ చూసి సోనియానే బిత్తరపోయారంటే డిమాండ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది.
క్రియాశీల రాజకీయాల్లో రాహుల్ ఫెయిలయ్యారని, అయితే సోనియాకు రాహుల్ ను తక్కువ చేయడం ఇష్టం లేదు కాబట్టి.. ప్రియాంకను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని నేతలు, క్యాడర్ కోరుతున్నారు. అదే జరిగితే ఇందిరను తలపించే ప్రియాంక పార్టీకి అధికారం సాధించి పెడతారని, మోడీ మ్యాజిక్ కూడా తుడిచిపెట్టుకుపోతుందని ధీమాగా చెబుతున్నారు.
కానీ సోనియా మాత్రం ప్రియాంక వస్తే రాహుల్ తెరమరుగౌతారని మథనపడుతున్నారు. ఇప్పటికే వ్యక్తిగత జీవితంలో ఒంటరిగానే ఉన్న రాహుల్.. రాజకీయాల్లోనూ ఒంటరైతే ఏమైపోతారోననే ఆందోళన సోనియాకు ఉంది. అందుకే ప్రియాంకను ఏ రూపంలో పార్టీలోకి తెచ్చినా రాహుల్ ను డామినేట్ చేస్తారని భయపడుతున్నారు. మరి అధినేత్రి స్పష్టమైన నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.
మరిన్ని వార్తలు: