కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ నేతను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ నుండి పొంగులేటి అనుచరుడిగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మనోహర్ రెడ్డి ఇప్పుడు ఎటు వైపు వెళ్తారు అనేది వేచి చూడాలి. కాగా, మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ తరుణంలోనే… కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి పై వేటు వేశారు. కాగా.. రెండు నెలల కిందటనే..కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.