వచ్చే నెల 28వ తేదీన తెలంగాణ సింగరేణి ఎన్నికలు…!

Political Updates: Polling for Singareni election starts today
Political Updates: Polling for Singareni election starts today

తెలంగాణ సింగరేణి సంస్థలో ఎట్టకేలకు ఎన్నికల సైరన్‌ మోగింది. వచ్చే నెల 28వ తేదీన సింగరేణి కాలరీస్ సంస్థ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ డి.శ్రీనివాసులు ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు.