ఎమ్మెల్యేగా కళ్యాణ్‌ రామ్‌.. ఎన్టీఆర్‌ ప్రచారం…!

NTR Big Plan For Kalyan Ram

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో నగారా మోగబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను కేసీఆర్‌ రద్దు చేసిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడివ్వాలనే పట్టుదలతో బద్ద శత్రువులు అయిన కాంగ్రెస్‌ మరియు టీడీపీ జత కట్టబోతున్నాయి. మహాకూటమిగా ఏర్పాటు అయ్యి పార్టీలు కలిసి పోటీకి సిద్దం అయ్యాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో ఈ మహాకూటమి ఏర్పాటు అయ్యింది. ఇక ఈ మహాకూటమి తరపున నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్‌ రామ్‌ను శేర్‌ లింగంపల్లి నియోజక వర్గంలో పోటికి దించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అదుతుంది.

 

tdp

శేర్‌లింగంపల్లిలో ఎక్కువ శాతం సెటిలర్స్‌ ఉంటారు. దానికి తోడు ఎక్కువగా నందమూరి అభిమానులు ఉంటారనే టాక్‌ ఉంది. అందుకే తెలుగు దేశం పార్టీ తరపున శేర్‌లింగంపల్లిలో కళ్యాణ్‌ రామ్‌ను నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణ్‌ రామ్‌ పోటీ చేస్తే ఖచ్చితంగా ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తాడనే టాక్‌ కూడా వస్తుంది. ఎన్టీఆర్‌ ప్రచారం చేస్తే సునాయాసంగా కళ్యాణ్‌ రామ్‌ గెలిచే అవకాశం ఉందని తెలుగు దేశం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

congress-tdp