టైగర్ నాగేశ్వరరావు సినిమాపై కుట్ర…?

Mass. Maharaja Ravi Teja
Mass. Maharaja Ravi Teja

మాస్ మహారాజా రవితేజ గురించి చెప్పాల్సిన పనిలేదు. .వరుసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రవితేజ దసరా కానుకగా “టైగర్ నాగేశ్వరరావు” సినిమాతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.

దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహలు చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. .ఈ సినిమాను ఆపడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని మూవీ టీం ప్రకటన విడుదల చేసింది. ఇక రవితేజ సినిమాను ఆపడానికి ఎవరు కుట్రలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

బందిపోటు నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా రూపొందనుంది. రవితేజ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ తో పాటు సినిమా అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.అయితే ఈ సినిమా అక్టోబర్ 20 విడుదలవుతుందని అందరూ భావిస్తున్నారు కానీ ఈ సినిమా వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దానిని సీరియస్ గా తీసుకున్న మూవీ టీం రిలీజ్ డేట్ పై ప్రకటన విడుదల చేసింది. కొన్ని దుష్ట శక్తులు మా సినిమాపై రూమర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. అంటూ మూవీ టీం పేర్కొన్నారు.తమ సినిమాపై ట్రేడ్ లోను మంచి అంచనాలు ఉన్నాయని, ఆఫర్స్ ఎక్కువగా రావడంతో దాన్ని చూసి తట్టుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రెస్ నోట్ విడుదల చేసింది.

మూవీ టీం. దసరాకి ఈ సినిమాతో పాటు బాలయ్య బాబు ”భగవంత్ కేసరి”, విజయ్ నటించిన “లియో” సినిమాలు విడుదల కానున్నాయి. ఎవరు టైగర్ నాగేశ్వరరావు సినిమాపై కుట్రలు చేశారు అనే విషయాన్ని చెప్పలేదు ఇక రవితేజ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్.