తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన రాతపరీక్షలో 90 వేలమంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి అధికారిక వెబ్సైట్లో అభ్యర్థుల ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును అందుబాటులో ఉంచారు. తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో సివిల్, ఏఆర్, టీఎస్ ఎస్పీ, ఫైర్, ప్రిజన్స్, డ్రైవర్స్ తదితర విభాగాల ఫలితాలకు కలిపి మొత్తంగా 17,156 మంది ఎంపికై నట్లు టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడించారు. వీరిలో 13,373 పురుషులు; 2,652 మహిళా అభ్యర్థులు ఉన్నారు. కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక జాబితాలపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే అక్టోబరు 1న సాయంత్రం 5 గంటలలోపు తమ అభ్యంతరాలను తెలపవచ్చు. ఇందుకు గాను అభ్యర్థులు రూ.2000 సర్వీసు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది.
మరింత సమాచారం కోసం https://www.tslprb.in/ వెబ్సైట్ను చూడాలని చెప్తున్నారు.