Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
స్వతంత్ర భారత చరిత్రలో అతిపెద్ద జాతీయ పార్టీగా వెలుగు వెలిగిన కాంగ్రెస్ పనైపోయినట్లే కనిపిస్తోంది. ఇప్పటిదాకా విమర్శకులు, ప్రత్యర్థులు, ప్రజలు, చివరకు పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ఆ పార్టీని ఈసడించారు. ఇప్పుడు ఏకంగా పార్టీని సరైన దారిలో పెట్టాల్సిన కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు కూడా చేయి దాటిపోయిందని చెప్పారంటే ఇక కాంగ్రెస్ పరిస్థితేంటో ఊహించుకోవచ్చు.
కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు ఆశిష్ ను రాహుల్ ఏరికోరి తెచ్చుకున్నారు. ఆశిష్ కూడా సిన్సియర్ గా కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం ఎన్నో సలహాలిచ్చారు. కానీ ఒక్కటి కూడా ఎవరూ పట్టించుకోలేదు. గ్రూపు తగాదాలు కాంగ్రెస్ లో మొదట్నుంచీ ఉన్నా.. కొత్తగా తెచ్చిపెట్టుకున్న హిందూ వ్యతిరేకవాదం పార్టీ కొంప ముంచుతోందని ఆశిష్ కుండబద్దలు కొట్టారు.
కాంగ్రెస్ ప్రజాదరణకు గతంలో మధ్యేవాదం పునాదిగా ఉంది. కానీ కాంగ్రెస్ క్రమంగా అతి లౌకికవాదం వైపు మళ్లి.. మైనార్టీలు చంకనెత్తుకుందని, అదే సమయంలో మెజార్టీగా ఉన్న హిందువుల్ని నిరాదరించిందని, అందుకే కాంగ్రెస్ పై ఎవరికీ సానుభూతి లేదని ఆశిష్ చెప్పేశారు. ముఖ్యంగా సోనియా నాయకత్వంలో జరిగిన పలు కీలక విషయాలను కూడా ఆయన ఉదహరించడం కాంగ్రెస్ క్యాడర్ ను ఆశ్చర్యానికి గురిచేసింది.
మరిన్ని వార్తలు: