ఏపీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు

ఏపీలో స్వల్పంగా కరోనా వైరస్ కేసులు

ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పడిపోయాయి. కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. డిశ్చార్జిల సంఖ్య కూడా పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 6 వేలకు పడిపోయింది. అలాగే కరోనా మరణాలు రాష్ట్రవ్యాప్తంగా 7 వేలు దాటాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 63,406 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 599 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,70,675కి చేరింది.

అలాగే కరోనా మరణాలు కూడా భారీగా పడిపోయాయి. గురువారం కరోనా మహమ్మారి బారిన పడి 11 మంది మరణించగా, శుక్రవారం ఆ సంఖ్య ఆరుకు పడిపోయింది. కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు, కర్నూలులో ఒకరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు ఒకరు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,020కు చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 913 మంది కోవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,57,233 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,422కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,93,151 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.