భారత దేశం లో ఊహించని రీతిలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతుంది. గడిచిన 24 గంటల్లో 10 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే నమోదు అయిన కేసులతో ప్రజలు ఆందోళన చెందుతుంటే, ఒక్క రోజులోనే 10,956 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం దేశం లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,97,535 కి చేరింది.
అయితే నిన్న ఒక్క రోజే భారత్ లో 396 మంది మరణించనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదు అయిన కేసులతో భారత్ లో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 8,498 కి చేరింది. కరోనా వైరస్ మహమ్మారి నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటి వరకూ కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,47,195 కి చేరగా, ఇంకా 1,41,842 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
అయితే భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు ఇంత ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి.భారత్ తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో బ్రిటన్ దేశాన్ని అధిగమించింది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్ నాల్గవ స్థానం లో ఉంది.