కరోనా ఎఫెక్ట్: మెంటల్ డిప్రెషన్ తో..అర్ధనగ్నంగా ఒక మహిళ గొంతు కొరికాడు

తమిళనాడులో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక నుంచి తమిళనాడు వచ్చి గృహ నిర్బంధలో ఉన్న ఓ వస్త్ర వ్యాపారి ఇంట్లోంచి నగ్నంగా బయటకు వచ్చి ఓ వృద్ధ మహిళ గొంతును కొరికాడు. తమిళనాడులోని తెని జిల్లాలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. అయితే బాధితురాలిని నక్టియమ్మల్‌గా స్థానికులు గుర్తించారు.

అయితే కరోనా ప్రభావం దేశంలో తీవ్రంగా ఉండటంతో శ్రీలంక నుంచి వచ్చిన అతడిని బయటకి రావద్దని… తిరగవద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో మానసికంగా బాధకు గురైన ఆ వ్యక్తి నగ్నంగా బయటకు వచ్చి ఓ వృద్ధ మహిళ గొంతును కొరికాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగున ఉన్నవారు గుమికూడారు. బాధితురాలిగా వెంటనే తేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. అయితే నిర్బంధంలో ఉన్న అతడు ఒంటరిగా ఉండటంతో అలా ప్రవర్తించాడని తెలుస్తోంది. పోలీసులు అతడని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. నిందుతుడిని మణిక్ నందన్ గా గుర్తించారు.