నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ దారుణంగా విజృంభిస్తున్న తరుణంలో కొన్ని చోట్ల అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కేసులు నమోదవడం అనేది రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరింతగా భయాందోళనకు గురవుతుంది. కాగా రాష్ట్రంలో కొన్ని చోట్లా కరోనా వైరస్ అనుమానితులకు సంబందించినటువంటి టెస్టుల విషయంలో చాలా చోట్ల గందరగోళం నెలకొన్న సంగతి ప్రజలను మరింతగా ఇబ్బందికి గురి చేస్తుంది. కాగా ఇటీవల కర్నూలులోని గోస్పాడులో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి పేరుతో ఉన్న వ్యక్తి విషయంలో పొరబాటు పడ్డ అధికారులు అతడిని ఇంటికి పంపించారు. మళ్ళీ తప్పు తెలుసుకొని అతడిని క్వరెంటైన్ కి తరలించారు.

కాగా తాజాగా విజయవాడలో కూడా ఇలాంటి సంఘటన ఎదురైందని సదరు బాదితుడు ఆవేదన చెందుతున్నాడు. కాగా ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో తానె నేరుగా ఆసుపత్రికి వెళ్లానని, కాగా తనని దాదాపుగా 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచిన అధికారులు, రెండు సార్లు కరోన నిర్ధారణ పరీక్షలు చేసి, నెగిటివ్ వచ్చాక తన ఇంటికి పంపారని చెప్పారు. అయితే రెండు రోజుల తరువాత అతడికి కరోనా సోకిందని మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారని వెల్లడించారు. కాగా ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితులలోకూడా టెస్టు రిపోర్టు సరిగ్గా లేకపోవడం బాధగా ఉందని, సదరు బాధితుడు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.