దేశవ్యాప్తంగా కరోనా సోకిన వ్యక్తుల బీభత్సాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. కరోనా పేషెంట్లకు వైద్యం చేసేందుకు వైద్యులు వెళ్లే వాళ్లపై అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల దాడులకు పాల్పడుతున్నారు. మరికొన్ని ప్రదేశాల్లో ఏకంగా నగ్నంగా దర్శవమిస్తూ వారి పిచ్చిని ప్రదర్శించుకుంటున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కరోనా రోగులు నర్సులకు చుక్కలు చూపుతున్నారు. వార్డులో నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారు. ఇలా ప్రవర్తిస్తున్న కరోనా రోగులపై కేసు నమోదు చేశారు. తాజాగా ఘజియాబాద్ లో కరోనా వైరస్ సోకి ఐసోలేషన్ వార్డులో చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు నర్సులకు చుక్కలు చూపిస్తున్నారు. వార్డులో నగ్నంగా తిరుగుతూ వారి పై వేధింపులకు పాల్పడుతున్నారు. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ గత నెలలో నిర్వహించిన మర్కజ్ సమావేశానికి హాజరై కరోనా వైరస్ అంటించుకొని వచ్చినవారే.
అయితే వారిని ఆసుపత్రిలోని చేర్చి చికిత్స అందిస్తున్నా ఏమాత్రం జాలి లేకుండా నర్సులను లైంగికంగా వేధిస్తున్నారు. దీంతో వారిపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కొత్వాలీ ఘంటాఘర్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ హాస్పిటల్లో చేరిన ఆరుగురు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు ఐసోలేషన్ వార్డులో అర్ధనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధిస్తున్నారని, వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా తమకు సిగరెట్లు, బీడీలు కావాలని ఆరుగురు రోగులు.. వైద్యసిబ్బందిని.. డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, సమగ్ర దర్యాప్తు తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. కాగా లాక్ డౌన్ నిబంధనలు పాటించని తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్‌తో పాటు ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి దేశం మొత్తాన్ని తబ్లిగ్ జమాత్ బ్రదర్స్ గడగడలాడిస్తున్నారన్నమాట.