కృష్ణ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 177 కరోనా పాజిటివ్ కేసులు

కృష్ణ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 177 కరోనా పాజిటివ్ కేసులు

గత కొద్దీ రోజులుగా ఆంధ్రప్రదేష్ రాష్ట్రంలో మహమ్మారీ కరోనా వైరస్ బాధితుల కేసులు దారుణంగా పెరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా మహమ్మారి కరోనా వైరస్ ని నివారించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ మాత్రం కరోనా వైరస్ కేసులు పెరగడం ఆగడం లేదనే చెప్పాలి. కాగా ఇప్పటివరకు నమోదైన లెక్కల ప్రకారం… కృష్ణ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 177 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ఆ తరువాత స్థానంలో విజయవాడలో అత్యధికంగా దాదాపు 150 కేసులు నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.

కాగా విజయవాడలో కృష్ణలంక కార్మికనగర్, కుమ్మరిపాలెం ప్రాంతాలను డేంజర్ హాట్ స్పాట్స్‌గా రాష్ట్ర అధికారులు గుర్తించారు. అంతేకాకుండా రెండు పోలీస్ స్టేషన్లలో ఏడుగురుకి, ఐసోలేషన్‌లో మరో పీజీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఇకపోతే రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బాధితుల కేసులు ఎక్కువ మొత్తంలో నమోదవడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఆదివారం నాడు ఒక్క రోజే 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో, మొత్తం 200 వరకు కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.