తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. ఈ రోజు తెలంగాణలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దింతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27కి చేరింది. గత 24 గంటల్లో 1,245 శాంపిల్స్ పరిశీలించగా, 9 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నట్లు తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది.
అటు ఏపీలో 4 పాజిటివ్ కేసులు నమోదు అంమోడు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. వైజాగ్-3, ఏలూరు-1, JN-1 నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలకు వైద్యులు శాంపిల్స్ పంపారు. ఇక కొవిడ్ వ్యాప్తితో అప్రమత్తమైంది ఏపీ ప్రభుత్వం. పీపీఈ కిట్లు, ఆక్సిజన్, వెంటిలేటర్, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.