ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 797 కరోనా కేసులు, ఐదుగురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,097 యాక్టివ్ కేసులు ఉన్నారు.. కేరళలో 2, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కో మరణం నమోదు అయింది. అటు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొన్న కూడా కేసులు పదుల సంఖ్యలో నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 100 కు చేరువలో కోవిడ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
మేజర్ గా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు వైద్యులు కోవిడ్ భారిన పడ్డారు. న్యూ ఇయర్ వేడుకల్లో మరిన్ని పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. దీంతో అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదు అంటున్నారు వైద్యులు.