ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజుకి వేలల్లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 14,246 కరోనా పరీక్షలు నిర్వహించగా 125 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. అయితే కొత్తగా నమోదు అయిన 125 కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 3,843 కి చేరింది. అయితే ఈ ఒక్కరోజు కరోనా వైరస్ భారినుండి కోలుకున్న వారి సంఖ్య 34. ఇప్పటివరకు ఈ వైరస్ భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 2,387 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏ ఒక్కరూ కూడా కరోనా వైరస్ కారణంగా మృతి చెందలేదు. ఈ వైరస్ కారణం ఇప్పటి వరకూ 75 మంది మరణించారు, ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టిివ్ కేసులు 1,381 గా ఉన్నాయి. వీరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కరోనా పరీక్షలలో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 4,68,276 కరోనా పరీక్షలను నిర్వహించింది. దేశంలో అన్నింటి కంటే వేగంగా రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుంది.