కరోనా వైరస్‌ రోగనిరోధక ఔషధం

కరోనా వైరస్‌ రోగనిరోధక ఔషధం

నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ (ఎంసీఆర్‌హెచ్ఆర్డీఐ) ముందు హోమోయోపతి మందు కోసం వందలాది మందు బారులు తీరారు. కరోనా వైరస్‌ రోగనిరోధక ఔషధం పేరిట తెలంగాణ ఆయుష్ విభాగం ఓ స్టాల్‌‌ను ఏర్పాటు చేసి హోమియోపతి మందుల్ని పంపిణీ చేసింది.ఆర్సెనిక్ ఆల్బ్ 30 పీ ఔషదం కరోనాను నిరోధిస్తుందనే కేంద్రం సూచన మేరకు తెలంగాణ ఆయుష్ విభాగం వీటిని పంపిణీ చేసింది. రోజుక ఆరు పిల్స్ చొప్పున భోజనానికి అర గంట ముందు, అర గంట తర్వాత వేసుకోవాలని ఆ స్టాల్‌‌ దగ్గర రాశారు. ఏడాది లోపు వయసున్న పిల్లలకు తల్లిపాలతోపాటు రోజుకు మూడు బిల్లలు ఇవ్వాలని సూచించారు.

మంగళవారం ఒక్కరోజే 3500 మందికి 11,500 డోసుల ఔషధాన్ని పంపిణీ చేశారు. ఈ హోమియోపతి ఔషధాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ తరహా పిల్స్‌ను శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారికి, స్వైన్ ఫ్లూ సోకిన వారికి కూడా ఇచ్చామని వైద్యాధికారులు తెలిపారు.ఆర్సెనికా ఆల్బ్ ఔషధం కరోనా వైరస్ కోసం తయారు చేసింది కాదని.. కానీ ఏ రకమైన ఇన్‌ప్లూయెంజాకైనా ఉపయోగించొచ్చన్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని.. 200 పీ అనేది స్వైన్ ఫ్లూ‌ కోసమని, 30పీ అనేది కరోనా వైరస్ లక్షణాల కోసమని హోమియోపతి ఫిజిషియన్ ఒకరు తెలిపారు.