Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కొన్ని రోజుల క్రితం తాగిన మత్తులో కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ చెన్నైలోని అడయార్ వంతెనను ఢీ కొట్టిన తమిళ హీరో జై పై కేసు నమోదు అయిన విషయం తెల్సిందే. కేసు బుక్ చేసిన పోలీసులు వెంటనే ఆయనకు వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసి వదిలి పెట్టారు. అయితే కేసు నమోదు అవ్వడంతో కోర్టు వరకు వెళ్లింది. కోర్టులో జై ను ప్రవేశ పెట్టకుండా వదిలేసినందుకు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వెంటనే జైను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పర్చాలంటూ ఆదేశాు జారీ చేయడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే సోమవారం నాడు జైను కోర్టుకు హాజరు పర్చేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు.
తెలుగు అమ్మాయి అంజలి, జైలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలే వీరిద్దరు తమ ప్రేమ విషయంలో ఓపెన్ అయ్యారు. తామిద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే పెళ్లి మాత్రం కొంత కాలం అయిన తర్వాత చేసుకుంటామని వారు చెబుతూ వస్తున్నారు. ఇద్దరు కూడా కొన్నాళ్ల పాటు సహజీవనం కూడా చేశారు. ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్న జై, అంజలిలు ఇటీవల ఒక పార్టీలో కలుసుకున్నారు. ఆ సమయంలోనే జై కాస్త అతిగా తాగడంతో పాటు సొంతంగా కారును నడుపుకుంటూ పార్టీ నుండి బయటకు వెళ్లాడు. జై తాగిన మత్తులో ఒక వంతెనను ఢీ కొట్టాడు. దాంతో పాటు ఒక వాహనంను కూడా ఢీ కొట్టడం జరిగింది.
ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, కాని పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు జై కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇండియన్ లా ప్రకారం కేసు నమోదు అయితే తప్పనిసరిగా న్యాయస్థానం ముందు ఎవరైనా హాజరు కావాల్సిందే. అది జైకు మాత్రం పోలీసులు మినహాయించారు. అందుకే కోర్టుకు జైను హాజరు పర్చని కారణంగా పోలీసులపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహంను వ్యక్తం చేశాడు. అరెస్ట్ వారెంట్ జారీ అయినా కూడా పోలీసులకు చిక్కకుండా జై తప్పించుకు తిరుగుతున్నాడు. సోమ వారం వరకు జై కోర్టుకు హాజరు కాకుంటే కోర్టు దిక్కార కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉంది. సోమ వారం న్యాయమూర్తిని వెంట పెట్టుకుని జై నేరుగా కోర్టులో హాజరు అయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.