సోషల్‌మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత వేసిన పిటిషన్‌పై కూకట్‌పల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా పరువు నష్టం దావా వేసే బదులు..వారి నుంచి క్షమాపణ అడగొచ్చు కదా అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేది వారే.. పరువుకు నష్టం కలిగింది అనేది వారే కదా అని కోర్టు పేర్కొంది.
అయితే విడాకులు తీసుకోకుండానే సమంత జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆమె తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. సమంత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆమెను టార్గెట్ చేసి వార్తలు రాశారని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు వివరించారు.కాగా తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై బుధవారం కూకట్‌పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.