దేశంలో కోవిడ్-19 పరిస్థితి, వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యులు డా. వీకే పాల్ హాజరుకానున్నారు.
దక్షిణాఫ్రికాలో వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను క్షుణ్ణంగా పరీక్షడంతో పాటు దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకనేందుకు తగిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాలు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు విమానాల రాకపోకను నిషేధించాయి. ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే సహా 7 దేశాలపై అమెరికా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.