భారత్‌లో తీవ్ర స్థాయిలో కరోనా

భారత్‌లో తీవ్ర స్థాయిలో కరోనా

భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18 శాతం అంటే 44,889 కేసులు పెరిగాయి. మంగళవారం రోజు వైరస్‌ కారణంగా 441మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజే 1,88,157 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 14.43 శాతం నుంచి 15.13 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 93.88శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3 కోట్ల 79 లక్షల మంది కరోనా బారిన పడగా.. 4,87.202 మంది మరణించారు. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు తగ్గుముఖం పట్టినా.. కర్నాటక, కేరళలో కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు 8,961 చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.