సినిమా మొదలు పెట్టేముందు చిత్రయూనిట్ అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే! ఈ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామంటున్నారు హీరోయిన్ కత్రినా కైఫ్. సెట్స్‌లో అడుగు పెట్టే ముందు ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె నవ్వుతూ పరీక్ష చేయించుకున్నారు. తద్వారా అభిమానులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోమని సందేశమిచ్చారు. కాగా ఈ మధ్యే మాల్దీవులకు వెకేషన్ వెళ్లిన ఈ హీరోయిన్ అక్కడ దిగిన పొటోలను అభిమానులతో పంచుకోగా అవి నెట్టింట వైరల్‌గా మారాయి.
కాగా ‘మల్లీశ్వరి’ చిత్రంతో వెండితెరపై హీరోయిన్‌గా పరిచయమైన కత్రినా తర్వాత బాలీవుడ్‌కే మకాం వేసి అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ‘షీలా కీ జవానీ’, ‘చిక్నీ చమేలీ’, ‘జర జర టచ్ మీ’ అంటూ ఐటంసాంగ్‌లపైనా చిందేశారు. ఎన్నో హిట్లు సొంతం చేసుకుంటూ, అవార్డులు ఎగరేసుకుపోయిన ఆమె ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది ప్రథమార్ధంలో రిలీజ్ అవుతుంది. అలాగే సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ కట్టర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫోన్‌బూత్ చిత్రంలోనూ కత్రినా కనిపించనున్నారు. ఆద్యంతం కామెడీగా సాగే ఈ చిత్రానికి మీర్జా పూర్ ఫేమ్ గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.