Covid Updates: జేఎన్‌.1 వేరియంట్తో జాగ్రత్త..రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలు ఇవే

Covid Updates: Be careful with the JN.1 variant..These are the instructions of the Union Health Department to the states
Covid Updates: Be careful with the JN.1 variant..These are the instructions of the Union Health Department to the states

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా సమయంలో పాటించిన నిబంధనలు మళ్లీ పాటించాలని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ సోమవారం అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో ముఖ్య అంశాలు ఇవే

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్‌ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలి.

గతంలో జారీ చేసిన కొవిడ్‌-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలి.

జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఐఎల్‌ఐ (ఇన్‌ఫ్లుయెంజా లైక్‌ ఇల్‌నెస్‌), సారి (సీవియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌) రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ… వారి వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయాలి.

అన్ని జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్‌టీపీసీఆర్‌, యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించాలి.

ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్‌ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించాలి.