కరోనా దేశంలో శరవేగంగా దూసుకొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశంలోకి వచ్చేసినట్టేనని వైద్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే లక్ష 17 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్‌ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఆమోదించినన యాంటీ-కోవిడ్-19 డ్రగ్ మోల్నుపిరావిర్‌లో “ప్రధానమైన సేఫ్టీ సమస్యలు” ఉన్నాయని భారతదేశపు ఉన్నత ఆరోగ్య పరిశోధన సంస్థ తెలిపింది.
మరోవైపు ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ లైట్ తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారనంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్తలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు.
మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు , ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ పురుషులు, మూడు నెలల పాటు గర్భ నిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చన్నారు.అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. అలాగే డబ్ల్యుహెచ్వో గానీ, యూకేలో గానీ దీన్ని చికిత్సలో భాగంగా చేయలేదన్నారు. దీనిమై మరింత చర్చిస్తున్నామని భార్గవ వెల్లడించారు.
ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15-18 సంవత్సరాల వయస్సు వారికి “కోవాక్సిన్” మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడవద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. కోవాక్సిన్‌తో టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. తేలికపాటి ఇబ్బందులు వచ్చినా, రెండు మూడు రోజులకు అవే తగ్గిపోతాయని స్పష్టం చేసింది.
క్లినికల్ ట్రయల్స్‌లో 30,000 మందిలో దాదాపు 10-20 శాతం మందికి మాత్రమే సమస్యలొచ్చాయని, చాలా వరకు తేలికపాటివి,1-2రోజులలో తగ్గిపోతాయని మందులు అవసరం లేదని తెలిపింది. వైద్యుడి సలహా మేరకే మందులువాడాలని కూడా పేర్కొంది.అలాగే వ్యాక్సిన్ తరువాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్.
ఇది త్వరలోనే అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానుందని డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చిందంటూ వార్త లొచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. కరోనా సెకండ్‌వేవ్ కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. వైరస్ వ్యాప్తిని అడ్డు కునేందుకు భౌతిక దూరం, ఫేస్ మాస్క్, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అనే మూడు మంత్రాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలను, క్లోజ్డ్. వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచింది. అలాగే దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకోవడం, ఇంట్లో అందరం ఉన్నపుడు, కిటికీలు తెరిచి ఉంచుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.