తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అగమ్యగోచరంగా మారింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగే పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. అధిష్టానం మాత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌పై ఆశలు పెట్టుకుంది. గత ఐదు నెలల నుంచి కాంగ్రెస్ పీసీసీ పదవిలో ఎవరూ లేరు. ఇప్పుడు ఈ అంశమే కాంగ్రెస్ నాయకుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తాజాగా చర్చించిన అధిష్టానం. కాంగ్రెస్ పిసిసి పదవిని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కట్ట బెట్టేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తుంది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి కాంగ్రెస్ పీసీసీ పదవి కోసం ఢిల్లీ రావాలని కోరినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సరైన వ్యక్తి అని ఆంధ్ర ప్రదేశ్ పిసిసి పదవికి నియమించనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పిసిసి పదవిపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విముఖత చూపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల్లో తాను పిసిసి బాధ్యతలు చేపట్టడం సరైందికాదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే తీసుకు రావచ్చని అధిష్టానం అనుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పిసిసి పదవి చేపట్టేందుకు నిరాకరిస్తే కేంద్ర మాజీ రక్షణ మంత్రి పళ్లం రాజుకి పదవిని అప్పగించే ప్రయత్నంలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నది. కిరణ్ కుమార్ రెడ్డి విముఖతతో ఉండడానికి గల కారణాలు వివరించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఇంకో రెండు మూడు రోజుల్లో పిసిసి పదవి చేపట్టబోయేది ఎవరనేది తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం ఏపీపిసిసి పదవి చేపట్టిన తర్వాత వస్తుందా లేదా చూడాల్సిందే.