వయసు మీద పడటంతో క్రికెట్ గ్రౌండ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న కారణంగా మాజీ కెప్టెన్ ధోనీ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శల కారణంగా ధోనీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో వున్నా టీమిండియా కెప్టెన్‌గా అతని సారథ్యంలో ఎన్నో రికార్డులు నమోదై ఉన్నాయి.
ధోనీ రిటైర్మెంట్పై ఇటీవల మాజీ స్టార్ క్రికెటర్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ధోనీ సెలక్షన్‌కు దూరంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబరు వరకు సెలక్షన్‌కు అందుబాటులో ఉండకూడదని ధోనీ భావిస్తున్నాడు. దీనిని బట్టి నవంబరులో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌కు కూడా ధోనీ ఆడటం డౌటే.
ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తాత్కాలిక విరామం తీసుకున్న ధోనీ.. ఈ ఏడాది నవంబరు వరకు సెలక్షన్‌కు అందుబాటులో ఉండడం లేదని సమాచారం. ప్రపంచకప్ తర్వాత విండీస్ పర్యటనకు దూరమైన ఎంఎస్.. స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. అయితే సెలక్టర్లు షాకిస్తూ ధోనీని పక్కనపెట్టి రిషభ్ పంత్‌నే కొనసాగించారు.
నవంబరు వరకు ధోనీ అందుబాటులో ఉండడం లేదన్న సమాచారం నిజమైతే రేపటి నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీతోపాటు నవంబరులో స్వదేశంలో జరగనున్న బంగ్లాదేశ్ సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడు.