బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి కేరళ కోర్టు వివిధ సెక్షన్ల కింద మొత్తం 45 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఏకకాలంలో వాటిని అనుభవించాలని తీర్పునివ్వడంతో అతడు గరిష్ఠంగా 20 ఏళ్లు జైల్లో గడపాల్సి ఉంటుంది.
తండ్రి మరణించడం, తల్లి విడిచిపెట్టి వెళ్లిపోవడంతో ఓ బాలిక (14) తన బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందింది. వారి నివాసానికి సమీపంలోనే ఓ వృద్ధుడు దుకాణం నిర్వహించేవాడు. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021కు సంబంధించిన ఈ కేసులో ఇడుక్కి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు తాజాగా శిక్ష విధించింది.