నిర్మల్ జిల్లా పరిధిలోని ఖానాపూర్ లోని శివాజీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో యువతి అలేఖ్యపై దాడికి తెగ పడ్డాడు. ఈ దుర్గటనలో ఆ యువతి స్పాట్ లోనే ప్రాణాలను వదిలింది. అదేవిధంగా అలేఖ్య పై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన ఆమె వదిన, మూడేల్ల కుమారుడిపై కూడా ప్రేమోన్మాది శ్రీకాంత్ దాడికి దిగాడు. దీంతో ఆ తల్లీ, కొడుకు ఇద్దరికీ గాయాలయ్యాయి.
అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారు అయ్యాడు. అలేఖ్య, శ్రీకాంత్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారట.పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గురువారం శెట్పల్లి అలేఖ్య టైలరింగ్ కి వెళ్లి వస్తుండగా.. శ్రీకాంత్ దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. నిందితుడి శ్రీకాంత్ ఆచూకి కోసం గాలింపును ముమ్మరం చేస్తున్నారు.