Crime: ఆన్లైన్ గేమ్ పాస్వర్డ్ కోసం ఘర్షణ.. స్నేహితుణ్ని హత్య చేసిన యువకులు

Crime: Murdered their daughters last month... committed suicide today
Crime: Murdered their daughters last month... committed suicide today

మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్ పాస్వర్డ్ను తమతో పంచుకోవడానికి తిరస్కరించిన పపాయ్ దాస్(18) అనే పదో తరగతి విద్యార్థిని అతడి నలుగురు స్నేహితులు హత్య చేశారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. పపాయ్ దాస్ ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిశీంద్ర ఘాట్ సమీపంలో సగం కాలిన స్థితిలో ఉన్న పపాయ్ దాస్ మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. దర్యాప్తులో పపాయ్ దాస్ నలుగురు స్నేహితులే అతణ్ని హత్య చేసినట్లు వెల్లడైంది. పపాయ్ దాస్ స్నే హితులతో కలసి ఆన్లైన్ గేమ్ ఆడేవాడని, అయితే పాస్వర్డ్ను షేర్ చేసుకోవడానికి అతడు అంగీకరించకపోవంతో గొడవ జరిగి స్నేహితులు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.